Friday, May 17, 2024
- Advertisement -

ప్రధాని మోదీకి రాజీనామా లేఖలు సమర్పించిన అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి

- Advertisement -

అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. టిడిపికి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రిపదవులకు గురువారం సాయంత్రం రాజీనామాలు చేశారు. ప్రధానమంత్రికి స్వ‌యంగా తమ రాజీనామా లేఖలను మంత్రులిద్దరూ అందచేశారు. ఏపికి జరిగిన అన్యాయం కారణంగానే తాము రాజీనామాలు చేస్తున్నట్లు తమ లేఖల్లో మంత్రులు పేర్కొన్నారు.

ప్రత్యకహోదా, ఏపి ప్రయోజనాల విషయంలో బుధవారం కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన తర్వాత రాజకీయం వేగం పుంజుకున్నది. జైట్లీ ప్రకటనపై చంద్రబాబు ఎంపిలు, రాష్ట్రమంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.దీనిలో భాగంగానే ఈరోజు ప్ర‌ధానికి రాజీనామాలేఖ‌ల‌ను స‌మ‌ర్పించారు.

చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్రంలో టిడిపి మంత్రులు రాజీనామాలు చేయకముందే రాష్ట్రంలో బిజెపి మంత్రులు రాజీనామాలు చేయాలంటూ బిజెపి జాతీయ నాయకత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దాంతో గురువారం ఉదయమే బిజెపికి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు తమ రాజీనామాలు సమర్పించారు. చంద్రబాబును కలిసి రాజీనామా లేఖలను అందచేశారు. అయితే ఇప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేస‌కుంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -