Monday, May 6, 2024
- Advertisement -

గిద్ద‌లూరు టీడీపీలో మొద‌ల‌యిన‌ అంత‌ర్ యుద్ధం

- Advertisement -

ఫిరాయింపు నేత‌ల‌కు వారి నియోజ‌క వ‌ర్గాల్లో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లనుంచి తీవ్ర వ్త‌తిరేక‌త ఎదుర‌వుతోంది. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలోకూడా ఫిరాయించిన నేత‌ల‌కు ప్ర‌జ‌లు నిల‌దీసిన ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్ర‌జ‌ల‌నుంచే కాకుండా ఇప్పుడు సొంత‌పార్టీ నుంచే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.

పార్టీ ఫిరాయించే స‌మ‌యంలో సీట్లు, ప్యాకేజీలల‌కోస‌మే పార్టీమారార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌ష్యం. పార్టీ మారే స‌మ‌యంలో చంద్ర‌బాబు నేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. అసెంబ్లీ షీట్లు పెరుగుతాయ‌ని దాంతో సీట్లు కేటాయింపులో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

అయితే చంద్ర‌బాబు పెట్టుకున్న ఆశ‌ల‌కు కేంద్రం గండికొట్టింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అసెంబ్లీ సీట్లు పెర‌గ‌వ‌ని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ఫిరాయింపు నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంది. మ‌రో వైపు చంద్ర‌బాబు చేసిన అనేక స‌ర్వేల్లో ఫిరాయింపునేత‌ల‌కు వారి నియోజ‌క వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫిరాయించిన నేత‌ల ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని వారికి టికెట్లు ఇస్తే ఓడిపోవ‌డం గ్యారెంట‌నీ స‌ర్వేలో తేలింది. అందుకే వారిలో ఎక్కువ మందినేత‌ల‌కు టికెట్లు ఇచ్చేప్ర‌స‌క్తే లేద‌ని బాబు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా గిద్ద‌లూరు టీడీపీలో అంత‌ర్ యుద్ధం మొద‌ల‌య్యింది. వైసీపీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ రాకుండా ఉండేందుకు సొంత‌పార్టీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు గిద్ద‌లూరు టికెట్‌ను మైదుకూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త , టిడిపి ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అయిన మహేశ్‌కు ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది.

దీనికి ప్ర‌ధాన కార‌నం టీడిపి అగ్రనాయకులలో ఒకరైన మంత్రి యనమల రామకృష్ణడుకు దగ్గర బంధువులు. ఈ మేరకు గిద్దలూరు లో ప్రాధమికంగా సర్వే కూడా నిర్వహించారంట‌. సర్వేలో సానుకూల ఫలితాలు కనిపించడంతో క్షేత్రస్థాయి నుండి పనులు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

2019 ఎన్నిక‌ల్లో గిద్ద‌లూరు నియోజ‌క వ‌ర్గంనుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్తిగా పుట్టా మహేశ్ యాదవ్ ను రంగంలోకి దించేందుకు అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. మ‌రి వైసీపీనుంచి టీడీపీలోకి ఫిరాయించిన అశోక్‌రెడ్డి ప‌రిస్థి ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా త‌యార‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -