క్రికెట్‌లో సెక్స్ ఫ‌ర్ సెల‌క్ష‌న్స్‌!

రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయాలంటే తనకు అందమైన అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ సైఫీ డిమాండ్ చేసినట్లు యూపీ యువ క్రికెటర్ రాహుల్‌ శర్మ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ సాయంతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.

జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు.దీంతో అక్రమ్ సైఫీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు.ఈ విష‌యంపై ప‌లువురు క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

https://www.youtube.com/watch?v=xyCR3VAtppY