Thursday, May 2, 2024
- Advertisement -

రోహిత్ శ‌ర్మ ఒక్క సెంచ‌రీ…బ‌ద్ద‌లు కానున్న మూడు రికార్డులు

- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ వ‌రుస సెంచ‌రీల‌తో దూసుకుపోతున్నారు. ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు రోహిత్‌. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు శతకాలు బాదిన రోహిత్ శర్మ 544 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇంకా భార‌త్‌కు ఇంకో లీగ్ మ్యాచ్ శ్రీలంక‌తో ఆడాల్సింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై ఒక్క భారీ ఇన్నింగ్స్‌ ఆడితే ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని పలు రికార్డులను రోహిత్‌ నెలకొల్పె అవకాశం ఉంది.

ప్ర‌పంచ‌క‌ప్ లో నాలుగు శ‌త‌కాలు చేసిర రోహిత్ శ్రీలంక మాజీ ఆట‌గాడు సంగ‌ర్క‌ర స‌ర‌స‌న చేరాడు. ఒక్క శ‌త‌కం సాధిస్తే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాడిగా రోహిత్ రికార్డును నెల‌కొల్ప‌నున్నాడు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(673; 2003 ప్రపంచకప్‌లో) తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్‌ ఈ టోర్నీలో మరో 129 పరుగులు సాధిస్తే సచిన్‌ రికార్డు బద్దలవుతుంది. ఇప్పటివరకు ఈ జాబితాలో సచిన్‌(586; 2003లో), మాథ్యూ హెడెన్‌(580; 2007లో)తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -