Monday, May 5, 2025
- Advertisement -

పృథ్వీ షా అర్థ సెంచ‌రీ ..మూడో వికెట్ కోల్పోయిన ఇండియా

- Advertisement -

టీం ఇండియా యంగ్ సంచ‌ల‌నం పృథ్వీ షా రెండో టెస్ట్ మ్యాచ్‌లోను మెరిశాడు.హైదరాబాద్‌లో వెస్టండీస్‌తో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ పృథ్వీ షా అర్థ సెంచ‌రీ సాధించాడు. ఆట మొదటిరోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చేస్ తన అద్భుత బ్యాటింగ్ తో ఒంటరిపోరాటం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అతడికి హోల్డర్ అర్థశతకంతో చక్కటి సహకారం అందిచడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 295 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. చేస్ 98 పరుగులు చేసి సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచాడు.చేస్ సెంచరీ లాంచనాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే అతడు సెంచరీ తర్వాత ఎక్కువసేపు నిలవలేక పోయాడు.

106 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో చేస్ ఔటయ్యాడు. మొత్తంగా విండీస్ 311 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఉమేష్ యాదవ్ తన అద్భుత బౌలింగ్ తో విండీస్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడు 6 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్ మొద‌లు పెట్టిన ఇండియాకు ఆదిలోనే షాక్ త‌గిలింది.ఒపెన‌ర్ కేఎల్ రాహుల్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.వికెట్ కోల్పోయినా పృథ్వి మాత్రం వెనుకడుగు వేయలేదు. పుజారా తో కలిసి ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో (70 పరుగులు 53 బంతుల్లో) పృథ్వి ఓ చెత్త షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ వెంటనే పుజారా ఔటయ్యాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -