Saturday, April 27, 2024
- Advertisement -

మరో ఆసక్తికర పోరుకు సిద్దం.. రోహిత్ డౌటే ?

- Advertisement -

వెస్టిండీస్ తో జరుగుతున్నా అయిదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా జోరు కనబరుస్తోంది. ఇప్పటికే విండీస్ జట్టుపై రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. వెస్టిండీస్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆగష్టు 6 తేదీన వెస్టిండీస్, టీమిండియా మద్య నాల్గవ టి20 పోరు జరగనుంది.. ఈ మ్యాచ్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు కూడా మ్యాచ్ పై పట్టు సాధించేందుకు గట్టి పట్టుదలగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు విజయాలను నమోదు చేసిన టీమిండియా మూడవ మ్యాచ్ లో కూడా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని విడిస్ జట్టు భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్ల కూర్పు ఎలా ఉండబోతుందనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెస్టిండీస్ జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికి టీమిండియా జట్టు కూర్పులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మూడవ మ్యాచ్ లో అనూహ్యంగా వెన్ను నొప్పితో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్ శర్మ నాల్గవ మ్యాచ్ ఆడతాడా ? లేదా అనే సందేహాలున్నాయి. ఒకవేళ రోహిత్ జట్టుకు దూరమైతే రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మరో ఓపెనర్ గా సూర్య కుమార్ యాదవ్ స్థానానికి ఢోకా లేకపోయిన మూడవ స్థానంలో వచ్చే శ్రేయస్ అయ్యర్ పై వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా అయ్యర్ 0,10,23 పరుగులతో పెద్దగా రాణించలేకపోయాడు.

దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక తరువాతి స్థానాల్లో వచ్చే రిషబ్ పంత్, దీపక్ హుడా, హర్ధిక్ పాండ్య యధావిధిగా బరిలోకి దిగనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ లేదా హర్షల్ పటేల్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కనుంది. అలాగే గత మ్యాచ్ లో దారుణంగా విఫలం అయిన ఆవేశ్ ఖాన్ పై వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతడు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో 14.62 ఏకనామితో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని తప్పించి అతడి స్థానంలో వేరొక బౌలర్ కు స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో ఎలాంటి ఫలితాలు రాబడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -