చెలరేగిన సూర్య.. ఆధిక్యంలో రోహిత్ సేన !

- Advertisement -

వెస్టిండీస్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 164 పలుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్ల నష్టానికి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించిది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 50 బంతుల్లో 73 పరుగులతో ( 8ఫోర్లు, 4 సిక్సులు ) చెలరేగి అడగా.. బ్రాండన్ కింగ్ 20 బంతుల్లో 20 పరుగులు, కెప్టెన్ పూరన్ 22 బంతుల్లో 23 పరుగులు, పవెల్ 14 బంతుల్లో 23 పరుగులు, హేట్ మైర్ 12 బంతుల్లో 20 పరుగులతో రాణించారు.

ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, హర్ధిక్ పాండ్య, హర్షదీప్ చెరో వికెట్ తీసి విండీస్ జట్టును కట్టడి చేశారు. ఇక లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ వచ్చారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతుల్లో 11 పరుగులు చేసి గాయం కారణంగా అనూహ్యంగ గ్రాండ్ విడిచాడు. ఇక ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి సూర్య కుమార్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఎడాపెడ ఫోర్లు సిక్సులు కొడుతూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

- Advertisement -

ఇక మొత్తం మీద సూర్య కుమార్ యాదవ్ 44 బంతుల్లో 76 పరుగులు ( 8 ఫోర్లు, 4 సిక్సులు ) చేసి టీమిండియా ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో 24 పరుగులు, రిషబ్ పంత్ 26 బంతుల్లో 33 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 164 పరుగుల లక్ష్యాన్ని చేధించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -