Tuesday, April 30, 2024
- Advertisement -

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ కు టాటా చెప్పిన వెస్టిండీస్ .. కారణం అదే !

- Advertisement -

ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ స్థానం చాలా ప్రత్యేకమైనది. ఒకప్పుడు రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, మాల్కం మార్షల్, వంటి దిగ్గజ ఆటగాళ్లతో విండీస్ జట్టు బలమైన క్రికెట్ టీం గా ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగల మేటి ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ ను శాసించింది కరేబియన్ జట్టు. వన్డేలలో రెండు ప్రపంచ కప్పులు అలాగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలలోనూ రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. అలాంటి దిగ్గజ టీం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నా టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12 కు కూడా చేరుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించి అందరికీ షాక్ ఇచ్చింది. సూపర్ 12 కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో భారీ ఓటమి చవిచూసి ఇంటి ముఖం పట్టింది. .

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ టీం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. స్వల్ప స్కోర్ తో భరిలోకి దిగిన ఐర్లాండ్ టీం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలో 147 పరుగులు చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఐర్లాండ్ జట్టు సూపర్ 12 కు అర్హత సాధించగా.. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకప్పుడు టీ20 క్రికెట్ ను శాసించిన జట్టు అసలు క్వాలిఫై కూడా అవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఏంటని యావత్ క్రికెట్ అభిమానులు నోరెళ్ళబెడుతున్నారు.

అయితే అయితే విండీస్ జట్టు ఇంత ఘోరంగా విఫలం అవ్వడానికి ప్రధాన కారణం.. అజట్టులే ప్రధాన ఆటగాళ్ళేవ్వరు లేకపోవడమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్రిస్ గేల్, బ్రావో వంటి ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆండ్రూ రసూల్, సునిల్ నరైన్, కెరిన్ పొలార్డ్ వంటి ఆటగాళ్లు అంతర్గత కారణాల వల్ల జట్టుకు దూరమవ్వడం వంటి పరిణామాలతో విండీస్ జట్టు పూర్తిగా బలహీనపడింది. దీంతో జట్టు మెల్లమెల్లగా పూర్వవైభవం కోల్పోతు వచ్చింది. ఏది ఏమైనప్పటికి ఒకప్పుడు టీ20 మ్యాచ్ లలో భారీ హిట్టర్లకు పెట్టింది పేరుగా నిలిచిన వెస్టిండీస్ జట్టు.. ఇప్పుడు అసలు టోర్నీకి క్వాలిఫై అవ్వకుండానే నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందా ?

సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. సచిన్ క్లారిటీ ?

సూర్య చాలా డేంజర్.. జాగ్రత్త గురూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -