Wednesday, May 7, 2025
- Advertisement -

రాజస్థాన్‌కు షాకిచ్చిన పంజాబ్

- Advertisement -
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్‌కు షాకిచ్చింది పంజాబ్ కింగ్స్. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ విధించిన 145 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి చేధించింది. కెప్టెన్‌ కరన్‌ 41 బంతుల్లో 3 సిక్స్‌లు,5 ఫోర్లతో 63 నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో రాణించిన కరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైంది. యశస్వి జైస్వాల్‌ (4) ,కోహ్లర్‌ కడ్మొర్‌ (18) ,శాంసన్‌(18) ,అశ్విన్‌ 28, పరుగులు చేశారు. అయితే రియాగ్ పరాన్ 34 బంతుల్లో 48 పరుగులు చేయడంతో రాజస్థాన్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. సామ్‌ కరన్‌ (2/24), హర్షల్‌ పటేల్‌ (2/28), చాహర్‌(2/26) రాజస్థాన్‌ను కట్టడిచేశారు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన రాజస్థాన్‌ రాయల్స్‌ టాప్‌-2 ప్లేస్‌ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -