భారత ప్లేయర్ రాబిన్ ఉతప్పకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఆటలో దూకుడుగా ఆడుతాడు. అయితే ఐపీఎల్ వేలంలో రాబిన్ ఉత్తప్ప జాక్ పాట్ కొట్టాడు. గురువారం కోల్ కతాలో నిర్వహించిన వేలంలో ఉత్తప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.
వెటర్న్ స్పెషలిస్టు ఓపెనర్ అయిన ఉత్తప్పను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. వాస్తవానికి ఈ సారి వేలంలో తను కనీసధరను రూ.1.50 కోట్లకు ఊతప్ప నిర్దేశించుకున్నాడు. అయితే వేలంలో తన పేరు వచ్చిన కాసేపటికి ఫ్రాంచైజీలు తన కోసం పోటీపడ్డాయి. మెల్లిగా తన ధర అమాంత పెరుగుతూ పోయింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ ఉత్తప్పను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంకోవైపు ఈసారి వేలంలో తెలుగు ప్లేయర్ హనుమ విహారి, టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారాలకు నిరాశ తప్పలేదు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ విహారిని కొనుగోలు చేయగా.. ఈసారి తనకు నిరాశే ఎదురైంది. మరోవైపు పుజారాను కూడా ఈసారి వేలంలో ఎవరూ తీసుకోలేదు.