ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శుభారంభం చేసింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాంటింగ్ చేసింది ఢిల్లీ జట్టు.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 భారీ పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బౌలర్లకు ఢల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చుక్కలు చూపించాడు. రిషబ్ పంత్ కేవలం 27 బంతుల్లో ఏడు సిక్స్ లు, ఏడు ఫోర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇంగ్రామ్ (47), శిఖర్ ధావన్ ( 43) రాణించారు. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 19.2 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
యువరాజ్ సింగ్ (53) అర్ధసెంచరీ సాధించినప్పటికి ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబడ రెండేసి వికెట్లు తీసుకోగా, బౌల్ట్, తివాటియా, అక్షర పటేల్, పాల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రపంచకప్‌లో చోటు సాధించేడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగాడు రిషబ్. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ కూడా అతనికే దక్కింది. మరోవైపు ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Advertisement -
రిషబ్ పంత్ విధ్వంసం…ముంబైపై ఢిల్లీ ఘన విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -