Saturday, May 11, 2024
- Advertisement -

క్రికెట‌ర్ల వార్శిక వేత‌నాల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ..కొత్త‌గా ఏ+గ్రేడ్‌..ష‌మీ,యువరాజ్   ఔట్‌

- Advertisement -

భారత క్రికెటర్లకు కొత్త వేతనాల చెల్లింపును బీసీసీఐ ప్ర‌క‌టించింది. గ‌తంలో ఆట‌గాల్ల వార్షిక వేత‌నాలు పెంచాల‌ని బీసీసీఐని కోరిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా బీసీసీఐ సరికొత్త కాంట్రాక్ట్ సిస్టమ్‌ను రూపొందించింది. కొత్తగా ఏ+ గ్రేడ్‌ను ఏర్పాటు చేసింది.

సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీఓఏ సూచనల మేరకు ఇక నుంచి భారత సీనియర్ జట్టులో ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలు ఉంటాయి. ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తారు. కేటగిరీ-ఏ పరిధిలోకి వచ్చే ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందిస్తారు. బీ-కేటగిరీలోకి వచ్చే వారికి రూ.3 కోట్లు, సీ- కేటగిరీలో వచ్చే వారికి రూ.1 కోటి చొప్పున చెల్లించనున్నారు.

భారత సీనియర్ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.

ఏ-కేటగిరీలో.. అశ్విన్, జడేజా, మురళీ విజయ్, పుజారా, రహానే, ధోనీ, సాహాలకు స్థానం కల్పించారు. టెస్టు క్రికెట్ ఆడని కారణంగా ధోనీకి కేటగిరీ ఏ+లో అవకాశం కల్పించలేదు.

బీ-కేటగిరీలో కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లకు అవకాశం దక్కింది. సీ-కేటగిరీలో కేదార్ జాదవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించారు. యువరాజ్ సింగ్‌, షమీలను కాంట్రాక్ట్‌ల విషయంలో పట్టించుకోలేదు.

మహిళా క్రికెట్లో కొత్తగా గ్రేడ్-సిని ఏర్పాటు చేశారు. ఏ-గ్రేడ్ మహిళా ప్లేయర్లకు రూ. 50 లక్షలు, బీ-గ్రేడ్‌లో చోటు దక్కించుకున్న వారికి రూ.30 లక్షలు, సీ-గ్రేడ్ ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం అందించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -