Monday, April 29, 2024
- Advertisement -

సచిన్ ఇలా ప్రాక్టీస్ చేసేవారా… వామ్మో..

- Advertisement -

ప్రపంచ మేటిగా ప్రశంసలు అందుకున్న ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ స్థాయికి రావడం కారణం ప్రధానంగా సచిన్ చేసే కఠోరసాధన చేయడమే. సచిన్‌ క్రికెట్‌ ఆడే సమయంలో తాను ఎలా ప్రాక్టీస్‌ చేశాడో చెప్పే వీడియోను ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

పూర్తిగా నీరు ఉంచిన పిచ్‌పై సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో.. ఇలా కూడా సాధన చేస్తారా అనిపిస్తోంది. ఫాస్ట్‌ పిచ్‌లపై బౌలర్లను ఎదుర్కోవడానికి నీరు నింపిన పిచ్‌ను సిద్ధం చేసుకుని రబ్బరు బంతులతో సచిన్‌ ప్రాక్టీస్‌ చేసిన ఒకనాటి వీడియో అది. దాన్ని సచిన్‌ షేర్‌ చేశాడు.

ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా వంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడటానికి ఇలా ప్రాక్టీస్‌ చేశాడట. ప్రత్యేకంగా నీటితో తడిసిన పిచ్‌లపై రబ్బరు బంతి వేగంగా రావడమే సచిన్‌ ఇలా ప్రాక్టీస్‌ చేయడానికి ప్రధాన కారణం. ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘ ఆటపై అంకిత భావం, ప్రేమ ఉంటే మనకు అదే కొత్త మార్గాలను చూపిస్తుంది. దీన్ని మించి ఎంజాయ్‌ కూడా చేయవచ్చు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. కుర్రాళ్లు ప్రయోగాలు చేయాలసి సచిన్ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -