Friday, April 26, 2024
- Advertisement -

ప్రభుత్వ వైద్యుల నిర్వాకం…వికలాంగుడిలా మారిన యువకుడు..

- Advertisement -

ఆరోగ్యంబాగోలేకుంటే ఆసుపత్రికి వెల్లి వైద్య చేయించుకుంటాం. అలాంటిది ఆసుపత్రి వైద్యులే తప్పు చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించలేము. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోవచ్చు. ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వైద్య చేస్తె దుస్పరిణామాలు ఎలా ఉంటాయో ఇదే ఉదాహరణ.

ప్రభుత్వ వైద్యు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓయువకుడు జీవితాంతం వికలాంగులా మారిపోయాడు.విజయవాడలో జరిగిన ఘటన చూస్తే.. సామాన్య జనం ప్రభుత్వాస్పత్రి వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అక్కడి వైద్యులు. గాయం ఒక దగ్గరైతే.. వైద్యం మరోచోట చేసి.. ఓ అభాగ్యుడి ప్రాణాలతో చెలగాటమాడారు.

వివరాల్లోకి వెల్తే…తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె.కొత్తపూడికి చెందిన గుమ్మడి రాజు (27) విజయవాడలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం ద్విచక్ర వాహనం స్టాండ్‌ తగిలి కాలికి గాయమైంది. అది కాస్త పెద్దది కావడంతో బెజవాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వచ్చారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న వైద్యుడు కాలికి అయిన గాయానికి కుట్లు వేశారు. అనంతరం రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మరునాటికి ఎడమ చెయ్యి పనిచేయడం లేదని గుర్తించాడు.దీంతో ఆస్పత్రికి చేరి ఆ వైద్యుడిని ప్రశ్నిచడంతో.. అతడు చెయ్యి విరిగిన వారికి వేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు వేసి పంపించేశాడు.

అక్కడ పిండికట్టు వేసి పంపినా ఫలితం కనిపించకపోవడంతో బాధితుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరిశీలించి ఇంజక్షన్‌ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అది నరాలకు తగిలిందని, దీనివల్ల సమస్య వచ్చిందని, మళ్లీ చెయ్యి తిరిగి పనిచేయడం అసాధ్యమని చెప్పడంతో హతాశుడయ్యాడు.

ఈ విషయం తెలియడంతో బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వైద్యులను నిలదీయగా.. కంగారుపడిన సిబ్బంది వైద్యం చేసి బాగు చేస్తామని, బాగుకాకుంటే పరిహారం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.తనకు డబ్బు అక్కర్లేదని, చెయ్యి పనిచేసేలా చేయాలని, లేదంటే జీవితాంతం వికలాంగుడిగా మిగిలిపోతానంటూ బాధితుడు ఆసుపత్రి ముందు నిన్న ధర్నాకు దిగాడు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -