Saturday, May 18, 2024
- Advertisement -

నిమ్మ‌కాయ‌లు కోస్తున్న స‌చిన్ వీడియో…

- Advertisement -

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ సామాజిక మాధ్యమాల్లో ఏ పోస్టు పెట్టినా అది వైరల్‌గా మారిపోతుంది. తాజాగా సచిన్‌ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

స్నేహితుల‌తో క‌లిసి ఓ ఫార్మ్‌హౌస్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నిమ్మ‌కాయలు కోస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ పెద్ద క‌ర్ర ప‌ట్టుకుని చెట్టు నుంచి నిమ్మ‌కాయ‌ను తెంపిన సంద‌ర్భాన్ని అత‌ని స్నేహితుడు వీడియో తీశాడు. స‌చిన్ కోస్తుంటే ఆ స్నేహితుడు కామెంట‌రీ కూడా ఇచ్చాడు.

స‌చిన్‌ నిమ్మకాయ కోసేందుకు సిద్ధమయ్యాడు అంటూ కామెంటరీ మొదలుపెట్టాడు. ఎంతో కష్టపడి సచిన్‌ నిమ్మకాయను తెంపగానే అతని స్నేహితుడు మామిడికాయ చిక్కింది అని పొరపాటుగా అన్నాడు. వెంటనే సచిన్‌ అందుకుని ఇది మ్యాంగో కాదు లింబూ అంటూ తాను కోసిన కాయను చూపించాడు. దీనికి అభిమానులు సచిన్‌కు చిన్ననాటి చేష్టలు గుర్తుకొచ్చాయా అంటూ కామెంట్లు పెట్టారు.దీంతో స‌చిన్ వెంట‌నే అత‌ని త‌ప్పును స‌రిచేస్తుండ‌టం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నాడు.

https://www.instagram.com/p/BeFYaDqD85d/?taken-by=sachintendulkar

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -