Tuesday, May 6, 2025
- Advertisement -

స‌చిన్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించిన ముంబ‌య్ క్రికెట్ అషోషియేష‌న్…

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ జ‌ట్టులో మైదానంలో 11 మంది ఆట‌గాల్లు ఉంటార‌నేది మ‌నం చూస్తున్నాం. అయితె అది మార‌బోతోంది. ఈ సారి ఏకంగా జ‌ట్టులో 14 మంది ఆట‌గాల్లుంటారు. 14 మంది ఆటాల్లేంటి అనుకుంటున్నారా మీరు విన్న‌ది నిజ‌మే. ఇది ఎవ‌రి నిర్ణ‌య‌మో కాదు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ నిర్ణయం.

సచిన్‌ నిర్ణయం పట్ల ముంబయిలోని ఎన్నో పాఠశాలలు, కోచ్‌లు, ఆటగాళ్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఎక్కువ మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం వస్తోందని.. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

స‌చిన్ రిటైర్‌మెంట్ త‌ర్వాత ఇంటర్‌ స్కూల్స్‌, ఇంటర్‌ కాలేజ్‌ టోర్నమెంట్స్‌ నిర్వహించే సమయంలో జట్టులో 15 మంది ఆటగాళ్లను తీసుకోవాలన్న ప్రతిపాదనను ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎమ్‌సీఏ) ముందుంచాడు. గత ఏడాది ముంబయి స్కూల్స్‌ స్టోర్ట్స్‌ అసోసియేషన్‌(ఎమ్‌ఎస్‌ఎస్‌ఏ) హ్యారీస్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో నాకౌట్‌ రౌండ్స్‌లో ఒకో జట్టులో 14 మందితో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసింది. ఈ కొత్త విధానం బాగుందని, పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

మ‌రోసారి 14మంది జట్టు ప్రస్తావన మరోసారి తెరపైకి రావడంతో దీనికి ఎమ్‌సీఏ ఆమోదం తెలిపింది. ‘ఈ ఏడాది ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టు 14 మందితో బరిలోకి దిగుతోంది’ అని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ) నిర్వాహకులు ప్రకటించారు. దీని వ‌ల్ల ఎక్కు ప్ర‌తిభ క‌లిగిన క్రీడాకారులు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈప‌ధ్ద‌తి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కూడా వ‌స్తె బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -