Tuesday, May 7, 2024
- Advertisement -

మోసమోతున్న వారిలో భారత్ కు రెండో స్ధానం

- Advertisement -

మనం అన్నింటిలోనూ ముందుంటున్నాం. ఇది ఒక్కోసారి ఆనందం కలిగించినా.. ఒక్కోసారి బాధ కలిగిస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలకు సిఇవోలు, ఎండిలు మనవాళ్లే అని మురిసిపోతూంటే మరోవైపు సోషల్ మీడియాలో మోసాలకు గురవుతున్న వారిలో భారతీయులు కూడా ఎక్కువే అని లెక్కలు చెబుతున్నాయ.

సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ సంస్ధ సైమన్ టెక్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. సోషల్ మీడియా మోసాల బారిన పడుతున్నవారిలో భారత్ కు చెందిన వారు ప్రపంచంలోనే రెండోస్ధానంలో ఉన్నారు. మాన్యువల్ షేరింగ్ ద్వారా సోషల్ మీడియాలో 94 శాతం కుంభకోణాల్లో  జరుగుతున్నాయి. ఇక కుంభకోణాలకు పాల్పడే వారు ముందుగా ఎంచుకునేది భారతీయులనే కావడం గమనార్హం.

ఇక్కడ సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు నానాటికి పెరగడం ఒక కారణమైతే.. ఎదుటి వారిని సులభంగా నమ్మి మోసపోవడం భారతీయుల వంతు అవుతోంది. దీంతో పాటు మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది, ఆసియా, పసిఫిక్, జపాన్ ప్రాంతంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఇక ఈ నేరాలలో చైనాదే మొదటి స్ధానం. ఆ దేశం 23.7 శాతంతో మొదటి స్థానంలోనూ, అమెరికా18.9 శాతంతో రెండో స్థానంలోనూ,భారతదేశం3.4 శాతంతో మూడో స్థానంలోనూ ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -