Thursday, May 9, 2024
- Advertisement -

ష‌మీని రోడ్డుమీద నిల‌బెట్టాలి…హసీన్ జహాన్

- Advertisement -

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమిని నడిరొడ్డు మీద నిలబెట్టి కొట్టేందుకు సహకరించాలని అతని భార్య హసీన్‌ జహాన్ మీడియాను కోరింది.షమీకి తాను అభిమానినని పాక్ మహిళ అలీషబా ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఆమె తీవ్రంగా స్పందించింది. అలీషబా తన భర్త అభిమాని కాదని ఆమె స్పష్టం చేసింది.

ఆమె తన భర్త గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా వ్యభిచారి అయినా అయ్యుండాలని తీవ్రవ్యాఖ్యలు చేసింది. సాధారణ అభిమానికి అంత రహస్యంగా హోటల్లో కలవాల్సిన అవసరం ఏముంది? అని ఆమె ప్రశ్నించింది. షమీకి తగిన శాస్తి జరగాలని ఆమె అభిలషించింది. షమీ ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేస్తాడని ఆమె ప్రశ్నించింది.

ఇక షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్‌లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్‌లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇక పాక్‌ యువతి అలీషబా సైతం స్పందించిన విషయం తెలిసిందే. షమీకి తాను కేవలం ఓ అభిమానిని మాత్రమేనన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -