ప్రపంచ కప్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో గెలుపు ద్వారా అన్ని జట్లకు సవాల్ విసిరింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సఫారీలు విధించిన 429 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు కుప్పకూలింది. కుశాల్ మెండీస్ (76), చరిత్ అసలంక (79), ధసున్ షనక (68), హాఫ్ సెంచరీలతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా… వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100), వాన్ డర్ డుసెన్ (108) , మార్క్రామ్ (106) సెంచరీలతో చెలరేగారు.
49 బంతుల్లోనే సెంచరీ చేసిన మార్క్రామ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో శతకం బాదిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (50 బంతులు) పేరిట ఉండేది.