Thursday, May 16, 2024
- Advertisement -

సెమీస్..భారత్ వర్సెస్ కివీస్ ఖాయమే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా నాలుగో జట్టుగా న్యూజిలాండ్ చేరడం దాదాపు ఖాయమైంది. కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసి సెమీస్ ఆశలను మరింత పదలిపర్చుకుంది. శ్రీలంక విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కాన్వే (45), రచిన్‌ రవీంద్ర (42), డారిల్‌ మిషెల్‌ (43)రాణించడంతో కివీస్ మెరుగైన రన్‌రేట్‌తో విజయాన్ని నమొదు చేసింది.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుషాల్‌ పెరెరా 51 పరుగులు చేయగా తీక్షణ 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించలేకపోయింది. బౌల్ట్‌ 3, ఫెర్గూసన్‌, శాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.శ్రీలంక ఓటమితో ఇంటి బాట పట్టగా కివీస్ సెమీస్ ఆశలను మరింత మెరుగు పర్చుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కివీస్‌ సెమీస్‌ను చేరుకోవడాన్ని ఎవరూ ఆపలేరు.

దీంతో భారత్‌తో న్యూజిలాండ్ పోరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2019 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌తోనే భారత్‌ తలపడగా వర్షం అంతరాయం మధ్య సాగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -