Sunday, April 28, 2024
- Advertisement -

పసికూనే..అయినా క్రికెట్‌ని నిలబెట్టారు!

- Advertisement -

ఎలాంటి అంచనాలు లేకుండా వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది పసికూన ఆప్గానిస్తాన్. గతంలో రెండు సార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన కేవలం ఒకే విజయాన్ని నమోదుచేసింది. దీంతో ఈ సారి కూడా ఆఫ్గాన్ ప్రదర్శన అలాగే ఉంటుందని భావించారు అంతా. కానీ అద్భుత ప్రదర్శనతో క్రికెట్‌ని నిలబెట్టింది ఆ జట్టు. ఈ మెగా టోర్నిలో తిరుగులేని ప్రదర్శన కనబర్చింది ఆ టీమ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌,శ్రీలంక,పాకిస్థాన్‌లతో పాటు నెదర్లాండ్‌ని ఓడించి నాలుగు విజయాలను నమోదు చేసింది. ఒకానొక దశలో సెమీస్ రేసులో నిలిచింది. వాస్తవానికి చివరి రెండు వన్డేలు ఆస్ట్రేలియా ,దక్షిణాఫ్రికాతో గెలిస్తే సెమీస్‌లో అడుగుపెట్టేదే. కానీ ఓటమి పాలు కావడంతో ఇంటి బాట పట్టింది ఆఫ్గాన్.

ఇక చివరి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఫ్గాన్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. వాన్ డెర్ డస్సెన్ 76, క్వింట‌న్ డికాక్ 41 పరుగులు చేయడంతో సఫారీ జట్టు విజయం సాధించింది. దక్షిణాఫ్రికాకు ఇది ఏడో విజయం.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 244 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (97 నాటౌట్) సెంచరీ మిస్ చేసుకోగా ర‌హ్మాత్ షా 26, ర‌హ్మానుల్లా గుర్భాజ్ 25 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో ఆఫ్గాన్ భారీ స్కోరు సాధించలేకపోయింది. వాన్ డెర్ డస్సెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -