Saturday, April 27, 2024
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ లో అందరి ఫోకస్ ఆ జట్లపైనే !

- Advertisement -

యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ మరి కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా ఆతిథ్యంలో ప్రపంచ కప్ ఆ దేశంలో జరగనుంది. ఇక ఇప్పటికే కీలక జట్లన్నీ ఆస్ట్రేలియా చేరుకున్నాయి. స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. ఇక ఈసారి పొట్టి క్రికెట్ లో సత్తా చాటి టైటిల్ ఎగరేసుకుపోయే జట్టు ఏది అనే దానిపై సర్వత్ర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి టైటిల్ హాట్ ఫేవరెట్ జట్లుగా ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు నిలవనున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 లలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఏ దశలోనైనా బ్యాటింగ్ చేసే మ్యాచ్ విన్నర్లకు టీమిండియాలో కొదువే లేదు..

కెప్టెన్ రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హర్డిక్ పాండ్య, వంటి మ్యాచ్ విన్నర్లు టీమిండియా సొంతం. దాంతో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ గా టీ20 వరల్డ్ కప్ బరిలో నిలవనుంది. ఇక టీ20 లకు మారు పేరుగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్ లో ఉంది. డేవిడ్ మలన్, అలెక్స్ హల్స్, హ్యారీ బ్రోక్ వంటి బ్యాట్స్ మెన్స్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం. ఇక డీపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా కూడా మరోసారి కప్ పై కన్నెసింది. టోర్నీ ఆ దేశంలోనే జరుగుతుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. స్వదేశంలో జరుగుతున్నా టోర్నీలో సత్తా చాటి మరోసారి కప్పు ముద్దాడాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. ఈ మూడు జట్లతో పాటు పాకిస్థాన్ కూడా ప్రస్తుతం టీ20 లలో అద్భుతంగా రానిస్తోంది. హార్డ్ హిట్టింగ్ జట్టు వెస్టిండీస్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇక ఇప్పటివరకు టైటిల్ నెగ్గని న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లు కూడా టీ20 వరల్డ్ కప్ పై గట్టిగానే ఫోకస్ పెట్టాయి. దాంతో ఈ సారి టీ20 వరల్డ్ కప్ అభిమానులకు పూర్తి వినోదం పంచడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -