Thursday, May 2, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : కే‌ఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి..? ఇలాగైతే కష్టమే !

- Advertisement -

టీమిండియా స్టార్ ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ గత కొన్నాళ్లుగా ఘోరంగా విఫలం అవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వరల్డ్ కప్ ప్రారంభం అయినది మొదలుకొని జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. పాకిస్తాన్ పై కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఆ తరువాత జరిగిన నెదర్లాండ్ పై కూడా 9 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో వరల్డ్ కప్ లో కూడా ఇంత ఘోరంగా విఫలం అవ్వడం ఏంటని రాహుల్ ఫామ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మినహా మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా ఫుల్ ఫామ్ లో ఉంటూ కీలక ఇన్నింగ్స్ లు అందిస్తున్నారు. దీంతో రాహుల్ పై మరింత ఒత్తిడి పెరిగింది. .

ఇక ఈ ఆదివారం సౌతాఫ్రికా తో భారత్ తలపడనుంది ఆ మ్యాచ్ గెలిస్తే భారత్ కు సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సౌతాఫ్రికాపై విజయం కోసం భారత్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ తిరిగి ఫామ్ లోకి వస్తే జట్టుకు తిరుగుండదు. అయితే రాహుల్ ఫామ్ లోకి వస్తాడా లేదా అన్నది చెప్పడం కష్టమే. దీంతో రాహుల్ స్థానంలో పృధ్వీ షా ను తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి రాహుల్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం టీమిండియా రెండు వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ఇదే దూకుడు ప్రదర్శిస్తూ సౌతాఫ్రికా పై కూడా విజయం సాధిస్తే.. భారత్ దర్జాగా సెమీస్ లో అడుగు పెడుతుంది. మరి టీమిండియా సౌతాఫ్రికాపై ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -