Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ బెయిల్ రద్దు కష్టమే.. రఘురామ కు షాక్ !

- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరియు వైఎస్ జగన్ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ లోనే ఉంటూ గత కొన్నాళ్లుగా ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు రఘురామ కృష్ణరాజు. వైసీపీ పై ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో.. అంతే స్థాయిలో రఘురామ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ పార్టీ విధానాలపై అలాగే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రఘురామ చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. దీంతో రఘురామను కట్టడి చేసేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితం లేకపోయింది.

ఇక జగన్ కు దిమ్మతిరికే షాక్ ఇస్తూ అక్రమస్తుల విషయంలో ఆ మద్య సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు రఘురామ. జగన్ కోర్టు నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనకు సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసు ను సిబిఐ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టు ను ఆశ్రయించారు రఘురామ. అయితే వాదనలు విన్న తరువాత ఇందుకు సంబంధించిన తీర్పును ధర్మాసనం రిజర్వ్ ఉంచుతూ వచ్చింది. ఇక తాజాగా రఘురామ పిటిషన్ కు కొట్టి వేస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. వైఎస్ జగన్ నిబంధనలు ఉల్లంగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని దాంతో ఈ పిటిషన్ కొట్టి వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు తో వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు రఘురామ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. మరి హైకోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ రఘురామ సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తారా ? లేదా ఇంతటితో వదిలేస్తారా ? అన్నది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -