Sunday, May 5, 2024
- Advertisement -

స‌చిన్ అభిమానుల దెబ్బ‌కు దిగివ‌చ్చిన ఆస్ట్రేలియా..

- Advertisement -

క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చేసిన ఓ ట్వీట్‌ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సచిన్‌ నేడు 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కూరుకుపోయి దేశం పరువును గంగలో కలిపినా ఆస్ట్రేలియన్లకు బుద్ధి రాలేదు. ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్ అభిమానులు, మాజీలు ఛీకొడుతున్న వేళ.. ఓ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ మంగళవారం బర్త్ డే జరుపుకొంటున్న సచిన్‌పై సెటైర్లు వేసింది. దీనికి ఇండియన్ ఫ్యాన్స్ దీటుగా స్పందించారు.

ఆస్ట్రేలియా బౌలర్లను సచిన్‌ చీల్చిచెండాడిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బదులిస్తున్నారు. ఇంకొందరైతే.. ‘ఎన్ని నిషేదాలు విధించినా మీరు మారారు.. సచిన్‌ బర్త్‌డే అని తెలిసి కూడా ఫ్లెమింగ్‌ బౌలింగ్‌ చేసిన వీడియోను ఎలా పోస్ట్‌ చేస్తారు.? మీకు వేరే బ్యాట్స్‌మన్‌ దొరకలేదా’ అని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

 

ఇండియన్ ఫ్యాన్స్ దెబ్బకు ఆ వెబ్‌సైట్‌కు దిమ్మతిరిగినంత పనైంది. ఇప్పటికే పరువు పోవడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా.. ఆస్ట్రేలియాపై సచిన్ ఆడిన అద్భుత షాట్లతో కూడిన వీడియోను పోస్ట్ చేసి మాస్టర్ బ్లాస్టర్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -