సూర్య ను ట్రోల్ చేస్తున్న.. అభిమానులు !

Trolls on Suryakumar Yadav Batting Style
Trolls on Suryakumar Yadav Batting Style

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో టీమిండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. జట్టు ఏదైనా బౌలర్ ఎవరైనా దుర్భేద్యమైన బ్యాటింగ్ తో నిర్ధాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడడమే సూర్య పని. తన భీకర ఫామ్ ను కొనసాగిస్తూ టీమిండియా విజయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా ఐసీసీ ర్యాంగింగ్ లో నెంబర్ ఒన్ స్థానాన్నికి చేసుకున్నాడు. ఆరంగేట్రం చేసిన చాలా తక్కువ టైమ్ లోనే నెంబర్ ఒన్ ప్లేస్ కు చేరుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇక సూర్య బ్యాటింగ్ కు మాజీలు సైతం ఫిదా అవుతున్నారు. అసాధ్యం కానీ షాట్స్ ను ఆడడం సూర్యకు మాత్రమే సాధ్యమని ప్రశంశలు కురిపిస్తున్నారు. 360 డిగ్రీస్ లో బ్యాటింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తూ.. అన్నీ వైపులా షాట్స్ ఆడుతూ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. . ఇక ఈ టి20 వరల్డ్ కప్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అతడు చేసే బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ , ట్రోల్స్ వైరల్ చేస్తుంటారు సూర్య అభిమానులు. ఆ విధంగా ఓ అభిమాని షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎలాంటి బాల్ వేసిన టీ తగినంత ఈజీగా బౌండరీకి తరలిస్తాడని తెలిపే విధంగా ఆ వీడియో ఉంది. అయితే తాను ఆవిధంగా షాట్స్ అడడానికి కారణం.. గతంలో తను రబ్బర్ బాల్ తో ప్రాక్టీస్ చేసే వాడినని అందుకే షాట్స్ అలవోకగా అడగలుగుతున్నాని సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.