Sunday, May 5, 2024
- Advertisement -

మన్జోజ్ కల్రా మ‌రో యువ‌రాజ్ సింగ్ అంటూ నెటిజ‌న్ల ప్ర‌శంశ‌లు….

- Advertisement -

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై యువ‌జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించింది. భార‌త్ విజ‌యంలో అద్భుత శతకం సాధించిన మన్జోత్ కల్రా కీలక పాత్ర పోషించాడు. త‌ద్వారా నాలుగోసారి అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన కల్రా.. ఫైనల్లోనూ అదే జట్టుపై తిరుగులేని ఆటతీరు కనబర్చాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కల్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు యువీని మైమరపించాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మన్జోత్ ఆడిన కొన్ని షాట్లు యువరాజ్‌ను మరిపించాయి. అతడి బ్యాటింగ్ స్టయిల్, ఆడిన స్ట్రయిట్ డ్రైవ్, పాదాల కదలికలు, పరిగెత్తే విధానం.. ఇలా చాలా విషయాల్లో నెటిజన్లు ఈ కుర్ర ప్లేయర్‌లో యువీని చూసుకుంటున్నారు. భ‌ష్యత్తులో యువీలా భారత జట్టులో కీలకంగా మారతాడని అప్పుడే అంచనాలు వేస్తున్నారు. 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ద్వారా యువీ వెలుగులోకి రాగా.. అప్పటికి ఏడాది కూడా నిండని మన్జోత్.. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారా అందర్నీ ఆకట్టుకున్నాడు.

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మన్జోత్ కల్రా రికార్డ్ నెలకొల్పాడు. 2012లో ఉన్ముక్త్ చంద్ ఆస్ట్రేలియాపై 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు మన్జోత్ కూడా అదే జట్టుపై 101 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -