Friday, May 17, 2024
- Advertisement -

ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడల్లా అమరావతి బొమ్మలు చూపించి బ్రతికేస్తూ ఉంటారా బాబుగారు?

- Advertisement -

2014ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసిన అంశాలు ఏమిటి? ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లాంటి నరేంద్రమోడీ ఇచ్చిన హామీలు, రుణమాఫీలు, అద్భుత రాజధాని, ఇంటికో ఉద్యోగంలాంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు. చంద్రబాబు మాటలపై జనాలకు నమ్మకం లేకుండా పోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక భజన నాయకుడి భజనకు తోడు పచ్చ మీడియా మొత్తం కూడా ఊరూ వాడ ప్రచారంతో హోరెత్తించడంతో అధికారంకి వచ్చాడు చంద్రబాబు. దానికితోడు అతి విశ్వాసంతో జగన్ చేసిన తప్పులు కూడా బాబుకు కలిసొచ్చాయి.

ఇప్పుడు మూడున్నరేళ్ళ తర్వాత చూసుకుంటే నరేంద్రమోడీ నుంచి తీసుకొస్తానన్న ఒక్క హామీని కూడా తీసుకురాలేపోయాడు చంద్రబాబు. ఈ విషయంలో ప్రశ్నిస్తానన్న నట నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చేతులెత్తేసి చేతకాని, చేవలేని మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీలు, ఇంటికో ఉద్యోగంలాంటి హామీలేవీ కూడా నెరవేరలేదు. తాజాగా చివరి బడ్జెట్‌లో మోడీ సర్కార్ చంద్రబాబుకు పూర్తిగా చిప్ప చేతికిచ్చిన నేపథ్యంలో కూడా కనీస స్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేయలేక, పచ్చ మీడియాలో తన హీరోయిజం రాతలు రాయించుకుంటున్న చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి బాబు అండ్ కో బ్రహ్మాండమైన ఐడియా వేశారు.

ఇతర హామీలన్నీ నెరవేర్చలేదు అన్న విషయం ప్రజలకు తెలిసిపోయినప్పటికీ చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైన అద్భుత రాజధాని నిర్మాణం అనే హామీ మాత్రం ఇంకా సజీవంగానే ఉందని చంద్రబాబు నమ్మకం. చంద్రబాబు కూడా ఆ హామీని కనీసం యాభై ఏళ్ళు లక్ష్యంగా సెట్ చేసుకుంటున్నాడు. అంటే ఈయన పాలనా కాలం, ఆ తర్వాత లోకేష్ పాలనా కాలం పూర్తయ్యే వరకూ కూడా నారావారికే అధికారం అప్పగిస్తూ ఉంటే అప్పుడు యాభై ఏళ్ళ తర్వాత అద్భుత అమరావతి చూపిస్తారన్నమాట. అందుకే ఆ బేలన్స్ ఉన్న రాజధాని నిర్మాణ హామీని మరోసారి ప్రజలకు చూపించి ప్రజా వ్యతిరేకత తగ్గించుకోవాలనుకున్నాడు చంద్రబాబు. ఆ వెంటనే కొన్ని గ్రాఫిక్స్ బొమ్మలను గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ చేత అద్బుతంగా చేయించి పచ్చ మీడియాలో అచ్చోసి వదిలారు. చిప్ప చేతికిచ్చినప్పటికీ కనీసం మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేక మీడియా ముందుకు వచ్చే సాహసం కూడా చేయలేకపోతున్న చంద్రబాబు చేతకానితనం జనానికి అర్థం కాకుండా జనాలను మాయ చేయడం కోసం ఈ గ్రాఫిక్స్ బొమ్మలు వదిలారు. అయితే అనుకున్నది ఒకటి….అయినది ఒక్కటి తరహాలో ఈ బొమ్మలు చూసిన జనాలు మాత్రం మరోలా అనుకుంటున్నారు. తనపైన వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం అద్భుత రాజధాని అని చంద్రబాబు అస్తమానమూ చెప్పుకునే అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలు వాడుకోవడంపై నెటిజనులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నిర్మాణ వ్యవహారాన్ని తన రాజకీయ స్వార్థం కోసం నారా వారు వాడుకోవడం ఏంటని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -