Sunday, May 5, 2024
- Advertisement -

ఉమేష్ యాదవ్ ప్రేమ కథ.. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు..

- Advertisement -

క్రికెట్ మైదనంలో ఏ మ్యాచ్ ఆడిన తన ఫాస్ట్ బౌలింగ్ తో భారత్ కు విజయాలను అందించాడు ఉమేష్ యాదవ్. గత ఏడు సంవత్సరాలుగా ఉమేష్ తన బౌలింగ్ తో దూసుకెళ్తున్నాడు. అతడి అ‌ధ్బుత బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాడిని ఔట్ చేయగల ఉమేష్ ప్రేమ అనే పిచ్ పై క్లీన్ బౌల్డ్ అయ్యాడని చాలా మందికి తెలియదు. ఉమేష్ వ్యక్తిగత జీవితంలో చాలా అందమైన.. స్వీట్ ప్రేమ కథ ఉందని చాలా మందికి తెలియదు.

అతడు ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండగా లవ్ లో పడ్డాడు. ఆ ప్రేమను వివాహందాకా తీసుకుని వచ్చాడు. ఉమేష్ లవ్ స్టోరీ.. ప్రేయసిని తొలిసారి కలుసుకున్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు చాలా మందికి తెలీదు. ఇప్పుడు వాటిపై ఓ లేయండి.. తాన్యను ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ఉమేష్ ఫస్ట్ టైం కలిశాడు. తాన్య తన స్నేహితుడితో కలసి మ్యాచ్ చూడటానికి వెళ్ళింది. ఇద్దరికి ఫ్రెండ్ అయిన అతడి ద్వారా తాన్యకు ఉమేష్ తో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ఫ్రెండ్ షిప్ గా మారింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితి తయారైంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2012 లోనే తామిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నామని తాన్య తెలిపింది. ఆమె చెప్పినట్లుగానే 2013లో ఉమేష్ వివాహం వైభవంగా జరిగింది.

తాన్యకు ఉమేష్ ఇబ్బంది కలిగించేది ఒక్క హైట్ విషయంలోనే..! తాన్య పొడవు చాలా తక్కువ కావడం.. ఉమేష్ పొడగరి అవడం వలన ఈ ఇబ్బంది అని అంటూ ఉంటుంది. తన నిరాడంబరం అంటే ఇష్టమని తాన్య తెలిపింది. ఉమేష్ తండ్రి కూలీగా బొగ్గు గనిలో పని చేశేవాడు. ఉమేష్ బాల్యం నాగ్పూర్ సమీప గ్రామంలో గడిచింది. 2007 సంవత్సరం నుంచి టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాడు. అక్కడి నుంచి కొనసాగుతూ జట్టులో సుస్థిర స్థానం వచ్చే దాకా ఎదిగాడు ఉమేష్. పోలీస్ అవుదాం ప్రయత్నించిన ఉమేష్ కి.. ఇప్పుడు ఏకంగా భారత్ భారత జట్టులో స్థానం దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -