ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మరో సారి బయటపడింది.ఇప్పటివరకు ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతు, పేర్లలోగందరగోళం ఉండేది. కానీ ఏకంగా ఓ సెలబ్రిటీని రాష్ట్రం కాని రాష్ట్రం ఓటర్ జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సోషల్‌మీడియాలో ఎన్నికల అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెల్తే ఢిల్లీకి చెందిన టీమిండియా కెప్టెన్ వారట్‌కోహ్లీ పేరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఉపఎన్నికల ఓటర్ జాబితాలో వచ్చింది. అంతేకాదు ఆయన పేరిట ఓటర్ స్లిప్ కూడా వచ్చింది. జాబితాలో కోహ్లి పేరు సాహజన్వా అసెంబ్లీనియోజకవర్గంలో 822వ ఓటరు నెంబరుతో రిజిస్టర్ అయింది.
ఈ ఘటనపై యూపీ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రత్నేశ్ సింగ్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
లోక్‌సభ పరిధిలోని షాజన్వా అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబంధించిన ఓటర్ల జాబితాలో 822 నెంబరుతో కోహ్లీ పేరిట ఓ ఓటరు స్లిప్ జారీ కావడం గుర్తించి, ఎన్నికల అధికారులకు సమాచారం అందించినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె అన్నారు. కోహ్లీ పేరును ఓటరుగా చేర్చడానికి సంబంధించి షాజాన్వా అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌డీఎం, తహశీల్దారులను ప్రశ్నించామని, ఓటర్ల జాబితాలో మరికొన్ని లోపాలు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని గోరఖ్‌పూర్ డీఎం రాజీవ్ రౌతెలా తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంత్రి మౌర్య ఇద్దరూ రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.