Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబుది ఖచ్చితంగా అవివేకమే?

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా ఆ ఓట్లను కాంగ్రెస్‌కు బదిలీ చేయించగలిగామన్నది చంద్రబాబు వాదన. అందుకే తెలంగాణలో కేసీఆర్ అహంకారమే ఆయన్ని దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్న తెలంగాణ ఎన్నికలను ఏపీకి ఆపాదించడం మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అవివేకమే అవుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అంతా సత్తా ఉంటే పోటీ చేసే వారే కదా అనే వాదన వినిపిస్తోంది. కనీసం జనసేన పవన్ చేసిన సాహసాన్ని కూడా చంద్రబాబు చేయలేకపోయారు. ఎందుకంటే పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో బాబు అండ్ టీంకు ఖచ్చితంగా తెలుసు. అందుకే పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ గెలవడంతో అది తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

రాజకీయ లభ్దికోసం క్షణాల్లో మాట మార్చడం చంద్రబాబుకే చెల్లుతుంది. ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ని ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఇప్పుడు పవన్‌కు ఉన్న మారుపేర్లన్ని టీడీపీ నేతలు పెట్టినవే. కాపు కళ్యాణ్, ప్యాకేజీ పవన్, ప్యాకేజీ స్టార్ ఇలా ఒకటేమికి నొటికి ఎన్ని వస్తే అన్ని మాట్లాడారు టీడీపీ నేతలు. కానీ ఆ తర్వాత పవనే దిక్కు కావడంతో ఆయన్ని మించిన గొప్పోడు లేరని చెబుతున్నారు. అయితే వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉండగా ఏపీలో మాత్రం జగనన్నకే ప్రజలు పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఏ అజెండాతో ముందుకు వెళ్లాలో తెలియక..తెలంగాణ ఎన్నికలను హైలైట్ చేస్తూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారని..ఇది ఖచ్చితంగా అవివేకమేని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -