Tuesday, April 30, 2024
- Advertisement -

బాడీ బిల్డర్ గా విరాట్.. అదరహొ!

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అంధించిన ఘనత కొహ్లీ చెందుతుంది. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టుని విజయ బాట పట్టించడం ఒక్క కోహ్లీకే సొంతం. అందుకే క్రికెట్ హిస్టరీలో క్రికెట్ గాడ్ గా పేరు గాంచిన సచిన్ టెండూల్కర్ తరువాత.. అంతటి ఆటగాడిగా పేరు గాంచాడు విరాట్. ఇక అభిమానులు ముద్దుగా రన్ మిషన్, ఛేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ప్రతి ఆటగాడి లైఫ్ లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం.. అలాగే కోహ్లీ కూడా కొంత కాలం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పటికి.. ఈ ఆసియా కప్ ద్వారా తిరిగి ఫామ్ లోకి వచ్చి టి20 వరల్డ్ కప్ లో తనదైన మార్క్ చూపించాడు. .

అయితే ఏళ్ళు గడుస్తున్న కోహ్లీ బ్యాటింగ్ లో పస ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి అతని ఫిట్ నెస్ కూడా ఓ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇతర ప్లేయర్స్ తో పోలిస్తే ఫిట్ నెస్ పరంగా కోహ్లీ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. ఎప్పుడు ఒకే రకమైన ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ తోటి ఆటగాళ్లకు స్పూర్తి గా నిలుస్తూ ఉంటాడు. ఇక న్యూజిలాండ్ పర్యటన కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ.. దొరికిన ఈ సమయాన్ని తన ఫిట్ నెస్ కోసం వినియోగించుకుంటున్నాడు. తాజాగా జిమ్ లో చెమటోడుస్తూ వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో ను విరాట్ తన ఇంస్ట్రాగ్రామ్ లో షేర్ చేశాడు ఆ వీడియోలో కోహ్లీ కొండలు తిరిగిన దేహంతో హెవీ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఇండియన్ క్రికెట్ హల్క్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన కోహ్లీ.. ఆ తరువాత జరిగే బంగ్లాదేశ్ పర్యటనలోనైనా పాల్గొంటాడో లేదో చూడాలి.

Also Read: పాండ్య పై ఫ్యాన్స్ ఫైర్.. ఇంత తలపోగరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -