- Advertisement -

బుడ్డోడి బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్థాన్ మాజీ బౌల‌ర్ వ‌సీమ్ అక్ర‌మ్‌..

- Advertisement -

టాలెంట్ ఉంటే చాలు… అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. సరిగ్గా అలాగే ఓ ఆరేళ్ల కుర్రాడికి అలాంటి అరుదైన అవకాశమే వచ్చింది. ఆ పిల్లవాడి బౌలింగ్ టాలెంట్‌కు వసీం అక్రమ్ ఫిదా అయ్యారు. అక్కడితో ఆగకుండా తన దగ్గరకు పిలిపించుకొన్నాడు. అప్పుడే ఆ బుడతడికి బౌలింగ్ పాఠాలు మొదలు పెట్టాడు.

వివ‌రాల్లోకి వెల్తే ఫిబ్రవరి 27వ తేదీన తన ట్విట్టర్ లో పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ ఒక వీడియో పోస్టు చేస్తూ, ‘ఇలాంటి టాలెంట్‌ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండి’ అంటూ కోరాడు. దీంతో నెటిజన్లు ఆ బాలుడి కోసం గాలింపు చేపట్టారు. మొత్తానికి ఆ బుడ్డోడ్ని పాకిస్థాన్‌ లోని చిచ్చవట్ని ప్రాంతంలో నెటిజన్లు పట్టేసి, ఆరున్నరేళ్ల ఆ బాలుడి పేరు హాసన్‌ అక్తర్‌ అని వివరాలు చెబూతూ వసీంకి సమాచారం చేరవేశారు.

దీంతో బాలుడి కుటుంబ సభ్యులను సంప్రదించి, తన దగ్గరికి తెప్పించుకున్నాడు. తానే నేరుగా బాలుడికి బౌలింగ్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేసుకున్న వసీం అక్రమ్… ‘నేను చెబుతున్న విషయాలను హాసన్‌ ఎంతో ఏకాగ్రతతో వింటున్నాడు. ఆశ్చర్యకరంగా ఔట్‌ స్వింగ్‌, ఇన్‌ స్వింగ్‌ వేయడానికి బంతిని ఎలా పట్టుకోవాలో కూడా హాసన్‌ కు తెలుసు. హాసన్‌ తో ఎంతో విలువైన సమయం గడిపాను. ఇంత తక్కువ వయస్సులోనే అతని వద్ద అసాధారణ ప్రతిభ ఉంది. హాసన్‌ చిచ్చవట్ని ప్రాంతానికి చెందినవాడు’ అంటూ ఆనందంతో నెటిజన్లకు తెలిపాడు. ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ అవుతాడన్నారు. కోచింగ్‌కు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని అక్రమ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -