ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌కు చేరుకుంది బంగ్లాదేశ్. చిన్న జట్టే అయినా బంగ్లాదేశ్ ఇతర జట్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సీనియర్ ఆటగాడు షకీబ్ నేతృత్వంలో బరిలోకి దిగనున్న బంగ్లా గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. ఏ జట్టునైనా ఓడించే సత్తా బంగ్లాకు ఉంది. సజ్ముల్ హుస్సేన్ శాంటో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా కీలక పేస్ బౌలర్ ఎబాదత్ మోకాలి గాయం నుండి ఇంకా కోలుకోపోవడంతో వరల్డ్ కప్ జట్టులో తీసుకోలేదు.
ఇక కెప్టెన్‌గా షకీబ్‌కు ఇది చివరి ప్రపంచకప్ కావడమే కాదు పోటీ కూడా. బంగ్లాదేశ్ పేస్ విభాగంలోనే కాదు స్పిన్‌లోనూ సత్తాచాటే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ మ్యాచ్‌ల లీస్ట్..
అక్టోబర్ 7 ఆఫ్ఘనిస్తాన్ ధర్మశాల
అక్టోబర్ 10 ఇంగ్లాండ్ ధర్మశాల
అక్టోబర్ 13 న్యూజిలాండ్ చెన్నై
అక్టోబర్ 19 భారత్
అక్టోబర్ 24 దక్షిణాఫ్రికా
అక్టోబర్ 28 నెదర్లాండ్స్
అక్టోబర్ 31 పాకిస్తాన్
నవంబర్ 6 శ్రీలంక
నవంబర్ 11 ఆస్ట్రేలియా
