Friday, May 17, 2024
- Advertisement -

ఢిల్లీలో లోకేష్ ఫేర్ వెల్ పార్టీ?

- Advertisement -

2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన పలు అవినీతి కేసుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉండగా తాజాగా నారా లోకేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోంది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్‌ కోసం వెళ్లిన లోకేష్‌కు స్వల్ప ఊరట దక్కింది. అక్టోబర్ 4 వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని సూచించింది న్యాయస్థానం. ఇక ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సీఐడీ అధికారులకు సూచించింది కోర్టు. దీంతో లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు సీఐడీ అధికారులు.

ఇక ఇదే సమయంలో ఇవాళ ఢిల్లీలో డిన్నర్ పార్టీ ప్లాన్ చేశారు లోకేష్. కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి మాత్రమే ఈ డిన్నర్ పార్టీకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంట్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సబంధించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తుండగా రఘురామ కృష్ణంరాజుతో పాటు సీనియర్ న్యాయవాది లూథ్రా తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహం, లోకేష్ అరెస్ట్ అయితే తర్వాత పరిణామాలు వంటి వాటిపై చర్చించనున్నారని సమాచారం. ఇక ఇదే పార్టీ లోకేష్‌కు ఫేర్ వెల్ అయ్యే అవకాశం కూడా ఉందని పలువురు నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారా లేదా వేచిచూడాలి.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-6 గా హెరిటేజ్ ఫుడ్స్ ని చేర్చింది సీఐడీ. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ కు అనేక ప్రయోజనాలు కలిగించారని ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌ మెంట్‌ మార్చడం ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారని ఆరోపణలు రావడంతో హెరిటేజ్‌ని చేర్చింది సీఐడీ. ఈ కేసులో ఏ–1 గా ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కు వైస్‌ చైర్‌ పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14 గా ఉన్న లోకేష్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -