Friday, May 17, 2024
- Advertisement -

చిక్కుల్లో రేవంత్ రెడ్డి!

- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపై కాంగ్రెస్ ఫస్ట్ లీస్ట్ కోసం ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మరోవైపు టికెట్ల కోసం కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చామని కొంతమంది బహిరంగంగా రేవంత్‌పై విమర్శలు గుప్పిస్తుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రూ.5,రూ.10,రూ.25 కోట్లు ఇలా ఒక్కొక్కరూ రేవంత్‌కు ముట్టజెప్పారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక కొంతమంది నేతలైతే రేవంత్ డబ్బులకే టికెట్లు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఆశీఇంచారు. పొంగులేటితో కలిసి ఖమ్మం వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సేవా కార్యక్రమాలతో మహేశ్వరంలో ఆయనకు మంచి పేరుంది.

2014లో బీఆర్ఎస్ నుండి పోటీచేసిన ఓడిపోయారు. అయితే తర్వాత అవకాశం రాకపోవడంతో సైలెంట్‌గా ఉండి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించగా బడంగ్ పేట్ మున్సిపల్ మేయర్ గా ఉన్న చిగిరింత పారిజాత నరసింహా రెడ్డి రూపంలో చిక్కెదురైంది. పారిజాత నరిసంహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకుని రేవంత్ వారికి మహేశ్వరం టికెట్ ఇచ్చారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయగా రేవంత్‌పై విమర్శల దాడిని మరింత పెంచారు.

ఇక సోషల్ మీడియాలో సైతం కొన్ని సీట్లలో ఎన్నారైలను దించి ఒక్కో సీటుకు రేవంత్ రూ.25 కోట్లు, కొన్ని సీట్లకు రూ.10 కోట్లు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. లీస్ట్ రాకముందే ఇంతపెద్ద మొత్తంలో విమర్శలు వస్తుండగా ఒకవేళ కాంగ్రెస్ లీస్ట్ వెల్లడై టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఏం చేస్తారోనని ఆసక్తికర చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో గాంధీ భవన్‌ కుర్చీలు విరగ్గొట్టడం, తాళం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి పరిస్థితే తలెత్తితే కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -