Tuesday, May 14, 2024
- Advertisement -

క‌న్న‌డి బ్యూటీకీ బోల్డ్ అయిన స్టార్ క్రికెట‌ర్‌…త్వ‌ర‌లో పెళ్లి..?

- Advertisement -

క్రికెట్-సినిమా రంగానికి విడ‌దీయ రాని సంబంధం ఉంది. టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా ఠాకూర్ ప్రేమజంటల నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క వరకు చాలా జంటలు ఇలానే ఒక్కటయ్యాయి. హర్భజన్- గీతాబస్రా, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, జహీర్‌ ఖాన్-సాగరికా ఘట్గేల జాబితాలో తాజాగా టీమిండియా క్రికెటర్ కూడా చేర‌నున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ కన్నడ నటి తనిష్కా కపూర్ కు బోల్డ్ అయ్యాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క ఉన్నార‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇటీవల వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ వీరు పలు ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని హాజరయ్యారు. ఈ సీజన్ ముగియగానే వీరి వివాహం ఉంటుందని తెలుస్తోంది.

తనిష్క సోషల్ మీడియా పోస్టులకు చాహల్ కచ్చితంగా లైక్ కొడుతుండడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వారి వివాహంపై వారి నుంచి కానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాకపోవడం విశేషం. అయితే క్రికెటర్లు, హీరోయిన్ల రిలేషన్‌షిప్ ఎప్పటినుంచో కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -