Tuesday, May 14, 2024
- Advertisement -

షూటింగ్ లకు షాక్ ఇచ్చిన మోడీ!

- Advertisement -
500 Notes and 1000 Notes Ban Effect on Tollywood

ప్రధాని నరేంద్ర మోడీ 500.. 1000 నోట్లు రద్దు చేసేస్తున్నామంటూ సంచనల నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీ అడ్డుకునే లక్ష్యంతో ఈ చర్య చేపట్టారు. ఇది దేశంలో ప్రతీ పరిశ్రమపై గట్టి ప్రభావం చూపుతుందని చెప్పోచ్చు. ఈ ఎఫెక్ట్ ముందుగా సినీ రంగం పై ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ కి అయితే.. ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.

కనీస మాత్రంగా సమయం ఇవ్వకుండా.. గంటల వ్యవధిలో కరెన్సీ రద్దు చేసేయడంతో.. ఇప్పటికిప్పుడు కేవలం 100 రూపాయల డినామినేషన్ తో పెద్ద మొత్తాలను పోగు చేయడం అంటే.. ఎవరికైనా తలకుమించిన పనే. పైగా సినిమా ఇండస్ట్రీలో రోజువారి సెటిల్మెంట్స్ చాలానే ఉంటాయి. కార్మికుల వేతనాలు ఎక్కువగా ఈ రూపంలోనే పేమెంట్స్ అవుతూ ఉంటాయి. ఇదే అతి పెద్ద సమస్యగా పరిణమించే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ విషయానికొస్తే.. క్యాష్ పేమెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి.

బ్యాంకుల్లో డబ్బులు వేయడం.. చెక్కుల రూపంలో చెల్లించడం లాంటివి బాగా అరుదు. బ్లాక్ మనీతో సినిమాలు తీస్తున్నారనే మాటలు కూడా చాలా రోజులుగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు 500.. 1000 నోట్లే చెల్లవని చెప్పేయడంతో వీటిని తీసుకునేందుకు ఎవరూ సాహసించరు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అనేక పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలపై ఈ ప్రభావం పడనుంది. కనీసం ఓ వారం పాటు షూటింగ్ లు.. షెడ్యుల్స్ డిస్టర్బ్ అయిపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Related

  1. ప్రజలు ఏం చెయ్యాలని మోదీ కోరుకుంటున్నారు?
  2. ప్రజలకు, బ్యాంకులకు రానున్న వారం రోజులు చుక్కలే..
  3. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు: ప్రధాని 
  4. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -