Sunday, May 19, 2024
- Advertisement -

ప్రజలు ఏం చెయ్యాలని మోదీ కోరుకుంటున్నారు?

- Advertisement -
What modi wants people to do?

న్యూఢిల్లీ: రూ. 500, రూ. 1000 నోట్లు మంగళవారం అనగా నవంబర్ 8 రాత్రి నుంచి ఇక చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజలు తమ వద్దనున్న పెద్ద నోట్లను ఏం చెయ్యలా అనే సందేహంలో పడ్డారు.

అయితే వివరాలను తెలుసుకోవడం ద్వారా మెల్ల మెల్లగా ఈ షాక్ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ నిర్ణయం దేశానికి దీర్ఘకాలంలో చాలా మంచిది. అయితే ప్రస్తుతం కొంతమేరకు ఇబ్బందులు తప్పవు. మోదీ ప్రభుత్వం ప్రజలు ఏం చెయ్యాలని కోరుకుటుంది?

  • వెయ్యి, ఐదొందల నోట్లు ఉన్న ప్రజలు వెంటనే చెయ్యాల్సిన పని వాటిని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో డిపాజిట్ చెయ్యాలి. అయితే అది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు మాత్రమే చేయాలి. 
  • అంటే బ్యాంక్‌లలో మీ డబ్బులను డిపాజిట్ చేయడానికి మీ చేతుల్లో 50 రోజులున్నాయి. కాబట్టి కంగారుపడాల్సిన అవసరం ఏమీ లేదు. 
  • ఈ విషయంలో ఏవిధమైన బాధ పడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు మీ సొంతమౌతాయి. కాకపోతే ప్రస్తుతమున్న రూ. 500, రూ. 1000 స్థానంలో కొత్త ఐదొందలు, రెండు వేల నోట్లు వస్తాయి. అంటే వెయ్యి రూపాయిల నోటు కొత్తది రాదు.
  • అయితే వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకునేప్పుడు ఆదార్ కార్డ్, పాన్, ఓటరు కార్డ్ వంటి ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. నవంబర్ 10 నుంచి 24 వరకు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కౌంటర్ల వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి పాత నోట్ల స్థానంలో కొత్తవి రోజుకు రూ. 4000 వరకు పొందవచ్చు. అయితే డిసెంబర్ 25 నుంచి 30 వరకు ఈ పరిమితిని పెంచుతారు. అదే బ్యాంక్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రం ఒక రోజు అధికంగా పది వేలు, మొత్తంగా వారంలో 20వేలు మాత్రమే కుదురుతుంది. అదే ఏటిఎంల ద్వారా అయితే రోజుకు రెండు వేలు మాత్రమే తీసుకోవడం కుదురుతుంది. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ పరిమితులను మామూలుగా వచ్చే వరకు పెంచుతుంటారు.
  • డిసెంబర్ 30లోపు ఎవరైతే వారి వద్దనున్న రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకోలేరో, వారు చింతించాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏదైనా కార్యాలయానికి వెళ్లి మార్చుకోవచ్చు. అయితే అది మర్చి 31 2017 లోపు మాత్రమే.
  • అయితే చెక్‌, డీడీ, డెబిట్, క్రెడిట్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటికి ఏ విధమైన అడ్డు ఉండదు. వాటి ద్వారా చేసే పనులను ఎప్పటిలాగే కొనసాగించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -