Saturday, May 18, 2024
- Advertisement -

ప్రజలకు, బ్యాంకులకు రానున్న వారం రోజులు చుక్కలే..

- Advertisement -
It is very difficult to people and banks

న్యూఢిల్లీ: నవంబర్ 8 అనగా మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు ఇక చెల్లవని స్వయంగా ప్రధాన మంత్రి మోడీ ప్రకటించడం సంచలన నిర్ణయమే. బ్లాక్ మనీ నివారణకు చేసిన ఈ చర్యవల్ల దీర్ఘకాలంలో చాలా ఉపయోగం ఉన్నప్పటికీ ప్రస్తుతం కొంత ఇబ్బంది తప్పేలా లేదు. ముఖ్యంగా ప్రజలకు, బ్యాంకులకు రానున్న వారం రోజుల పాటు చుక్కలు కనపడనున్నాయి.

వివరాలు చూస్తే..

దేశం కరెన్సీలో పెద్ద నోట్లు రూ. 100 తర్వాత ఉన్నవి రూ. 500, రూ. 1000 మాత్రమే. దేశం మొత్తం మీద ప్రజల చేతిలో ఉన్న డబ్బు విలువ సుమారు రూ. 17 లక్షల కోట్లు కాగా, ఈ రద్దయిన నోట్ల విలువ మాత్రం సుమారు రూ. 13.6 లక్షల కోట్లు. ఇవి ఇప్పుడిక చెల్లవు కాబట్టి ప్రజలందరూ ఆయా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఈ పరిస్థితిని బ్యాంకులు సమర్ధవంతంగా ఎదుర్కోవడం కష్టమే. వాటికి చుక్కలు కనపబనున్నాయి. 

తమ తమ బ్రాంచి ఆఫీసులకు వచ్చే పాత కరెన్సీని మార్చి కొత్త కరెన్సీని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు వారి వారి ప్లాన్స్‌లో మునిగిపోయాయి. చాలా బ్యాంకులు డబ్బులు లెక్కించే కొత్త మిషన్లను ఆర్డర్ చేసుకుంటున్నాయి. ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకులైతే తమ పూర్తి నెట్‌వర్క్‌ను ఇందుకోసం వినియోగించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా డిపాజిట్ మిషన్లను పూర్తి స్థాయిలో వాడేందుకు సిద్దమౌతోంది. 

ఇక్కడ అసలైన ఇబ్బంది మరొకటి ఉంది. కొన్ని ఎటిఎంలలో రోజుకు సుమారుగా 150 సార్లు మాత్రమే డబ్బులు తీసుకోవడం జరిగుతుంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితిలో వాటికి అందుబాటులో ఉన్న ప్రజలు వాటి నుంచి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తారో అంచనా వేయలేని పరిస్థితి. దేశంలో మొత్తం 2.15 లక్షల ఏటిఎంలు ఉన్నాయి.  గన్‌మెన్ సాయంతో వీటిలో డబ్బులను ఉంచడం పెద్దపని. పైగా పదివేల కంటే తక్కువ సంఖ్యలోనే క్యష్‌ను తరలించే వ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొత్త నోట్లు పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఈ ఏటిఎంలలో ఎక్కువశాతం రూ. 50, రూ. 100 నోట్లు పలుమార్లు పెట్టడం తప్పేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -