Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి

- Advertisement -
andhr pradesh TTD rac -begins forttd chairman post rayapati vs muralimohan

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలించ‌డంలేదు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న జ‌రిపినప్ప‌టినుంచి అన్నీ స‌మ‌స్య‌లు,చిక్కులే ఎద‌ర‌వుతున్నాయి. లోకేస్ వ్య‌వ‌హారం, పార్టీలో తీవ్ర అసంతృప్తి….. మ‌రోవైపు నంద్యాల ఉప ఎన్నిక విష‌యం బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బాబుకు టీటీడీ ఛైర్మెన్ రూపంలో మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డింది. ఈప‌ద‌వికి ఇద్దు సీనియ‌ర్ నేత‌లు పోటీప‌డుతున్నారు.

ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. చైర్మన్‌ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.ఇప్పుడ‌ది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అస‌మ‌యంలో చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్‌ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు ఇదే పదవిపై కన్నేసిన ఎంపీ మురళీమోహన్‌ కూడా తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం మురళీమోహన్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇద్ద‌రూ సీనియ‌ర్ నేత‌లు కావ‌డంతో ఎవ‌రికి కేటాయించాలో బాబు గంద‌ర‌గోలంలో ఉన్నారు.
ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్‌ తెరమీదకు వస్తోంది. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి.

{youtube}-UZRVMJo7lM{/youtube}

Related

  1. ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డి… మ‌రి సీఎం సీటు లోకేష్‌కా బాబు
  2. జగన్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎక్క‌డ బాబు…?
  3. చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాతే నిర్ణ‌యం
  4. బాబుని మరోసారి అడ్డంగా బుక్ చేసిన లోకేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -