Saturday, May 18, 2024
- Advertisement -

మనోళ్ళు చేసిన పనికి పాకిస్తాన్ లో తిండి లేకుండా పోయింది

- Advertisement -

ఉరీ ఉగ్రదాడి – సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఇండియా – పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో ప్రతీ భారతీయుడూ పాక్ పై అసహ్యతను – అనాసక్తిని – ఆగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పాక్ వస్తువులు బహిష్కరించాలని ముంబై యూత్ అసోషియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా తాజాగా గుజరాత్ రైతులు – వ్యాపారులు పాక్ పై తమకున్న ఆగ్రహాన్ని చేతల్లో చూపించారు.

ఇప్పటికే ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న దశలో తాజాగా గుజరాత్ వ్యాపారులు తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతుంది. పాక్ పై భారతీయులంతా ఎవరిస్థాయిలో వారు ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో గుజరాత్ వ్యాపారులు తమ రాష్ట్రం నుంచి పాకిస్థాన్ కు కూరగాయలు పంపకూడదని నిర్ణయించుకున్నారు.

వీటిలో ముఖ్యంగా టమోటాలు – మిర్చి పాక్ కు ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ స్థాయిలో భారీ నిర్ణయం తీసుకోవడంతో గుజరాత్ లోని రైతులు – వ్యాపారులకు రోజుకు సుమారు రూ.3 కోట్ల వరకూ నష్టం భరించాల్సి వస్తుంది. అయినా సరే.. తమకు జాతిప్రయోజనాలు ముఖ్యమని – రోజుకు రూ.3 కోట్లు లెక్కచేయబోమని చెబుతున్న గుజరాత్ వ్యాపారులు… పాక్ కు మాత్రమే కూరగాయల ఎగుమతి ఆపేస్తున్నామని – కెనడా – దక్షిణాఫ్రికా – బంగ్లా – గల్ఫ్ దేశాలకు మాత్రం ఎప్పటిలాగానే పంపుతామని చెబుతున్నారట.

ఇలా పాకిస్థాన్ కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కూరగాయలు పంపేది లేదని గుజరాత్ వ్యాపారులు స్పష్టం చేయడంతో పాక్ ప్రజలు కూరగాయలు దొరక్క అల్లల్లాడిపోతున్నారట. సాదారణంగా 1997 నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ అహ్మదాబాద్ నుంచి 50 ట్రక్కులలో టమోటాలు – మిర్చి వాఘా సరిహద్దు గుండా వెళ్తాయి. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యేవరకు పాకిస్థాన్ ప్రజలకు కూరగాయలు పంపబోమని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ ధర చెల్లిస్తామన్నా కూడా తాము మాత్రం వాళ్లకు టమోటాలు – పచ్చిమిర్చి పంపబోమని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -