- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌పై బాబు మౌనం!

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నానా యాగి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే తమకు మంచి ఫలితం రాబోతుందని తెలిపారు.

ఐదేళ్ల సంక్షేమ పాలన వల్లే ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేసేందుకు వచ్చారని..చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించిన పథకాలను ప్రజలు నమ్మలేదని అన్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు రోడ్లపైకి వచ్చారని ..పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత అధికారులను ఎక్కడ మార్చారో అక్కడే దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

తాడిపత్రిలో పోలీసులే సీసీ కెమెరా పగులకొట్టి హింసాకాండకు పాల్పడడం దారుణమని మండిపడ్డారు సజ్జల. జగన్ పై చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతూ విషం చిమ్ముతూనే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతో పురందేశ్వరి కేంద్రం వాళ్లతో మాట్లాడి ఇదంతా చేయిస్తున్నారనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -