Saturday, May 18, 2024
- Advertisement -

అగ్ని -2 ,బ్ర‌హ్మాస్ మిస్సైల్ల‌ను..విజ‌య‌వంతంగా ప‌రీక్షించిని భార‌త్‌

- Advertisement -
India successfully test fires agni ii ballistic missile and brahmas missile

అంత‌ర్జాతీయంగా అన్ని దేశాలు ఆయుధ సంప‌త్తిని ఘ‌న‌నీయంగా పెంచుకుంటున్నాయి.రోజు రోజుకీ ప‌రిస్థితులు మారిపోతున్నాయి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆయుధ పోటీని త‌ట్టుకొనేందుకు భార‌త్ కూడా గ‌న‌నీయంగా ర‌క్ష‌ణ రంగానికి నిధులు ఎక్క‌వ‌గానే కేటాయిస్తోంది.

ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న దేశాల‌లో బార‌త్ ఒక‌టి.ఇప్ప‌టికె భార‌త్ అమ్ముల‌పోదిలో వ‌విధ‌ర‌కాల మిస్సైల్లు ఉన్నాయి.వీటిలో ప్ర‌ధానాంగా చెప్ప‌కోవాల్సింది అగ్ని,బ్ర‌హ్మాస్ వేరియంట్ క్షిప‌నులు.ఇప్ప‌టికే అనేక సార్లు ప‌రీక్షించిని ఆర్మీ మ‌రోసారి ఈరెండు క్షిప‌నుల‌ ప‌రీక్షించింది.

తాజాగా అగ్ని-2 బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ క‌లామ్ దీవి నుంచి దీన్ని ప‌రీక్షించారు. ఇవాళ ఉద‌యం 10.22 నిమిషాలు క్షిప‌ణిని టెస్ట్ ఫైర్ చేశారు. గ‌తంలో అబ్దుల్ క‌లామ్ దీవిని వీల‌ర్స్ ఐలాండ్ అని పిలిచేవారు. అణు సామ‌ర్థ్యం క‌లిగిన అగ్ని క్షిప‌ణి సుమారు 2000 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించ‌గ‌ల‌దు. 20 మీట‌ర్ల పొడుగు ఉండే మిస్సైల్ రెండు ద‌శ‌ల్లో ప‌నిచేస్తుంది. అగ్ని బ‌రువు సుమారు 17 ట‌న్నులు ఉంటుంది. ఇది సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను కూడా మోసుకెళ్ల‌గ‌ల‌దు. డీఆర్‌డీవో అగ్ని క్షిప‌ణిని డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది.
అగ్నితోపాటు భూతల లక్ష్యాలపై విరుచుకుపడే అధునాతన శ్రేణి బ్రహ్మోస్‌ క్రూయీజ్‌ క్షిపణిని వరుసగా రెండో రోజు బుధవారం కూడా భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. సైన్యంలోని అత్యున్నత విభాగం ‘స్ట్రైక్‌ వన్‌ కోర్‌’.. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఈ పరీక్ష నిర్వహించింది. ‘బ్లాక్‌-3 శ్రేణి సూపర్‌సోనిక్‌ బ్రహ్మోస్‌ క్షిపణి వరుసగా ఐదోసారి కూడా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత కచ్చితత్వంతో పనిచేసింది’అని సైన్యం ఓ ప్రకటన విడుదలచేసింది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}DxkVjt-gGXc{/youtube}

Also Read

  1. అంత‌ర్జాతీయంగా ప‌రిస్తితు లు ఉద్రిక్తం ..ఏక్ష‌ణ‌మైనా యుద్ధం
  2. ఉత్త‌ర కొరియా దుందుడ‌కుతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తం…..
  3. చైనా, పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉడండి…
  4. ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -