నంద్యాల ఉప ఎన్నిక పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి.నిన్నటి వరకు శిల్పావర్గం,భూమావర్గం టికెట్ కోసం కుస్తీపడ్డారు. శిల్పా వైసీపీలోకి వెల్లడంతో భూమా వర్గానికి లైన్ క్లియర్ అయ్యింది.
భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి టికెట్ కరారయ్యింది.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు అభ్యర్తిపేరు ప్రకటించని బాబు ముందుగానే పేరును ప్రకటించారు.
ఇదే తరుణంలో భూమా సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. జగన్ నుంచి తనకేదో ఆఫర్ ఉందంటూ ప్రచారం సాగింది.అఖిల ప్రియ ఆవార్తలను కొట్టిపారేసింది.రాను రాను పరిణామాలు మారుతున్నాయి.అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యత అంతా అఖిల ప్రియ వర్గమే మోయాల్సి వస్తోంది! ఓరకంగా ఆమెకి ఈ బై ఎలక్షన్స్ అగ్నిపరీక్షే అని చెప్పాలి.
{loadmodule mod_custom,GA1}
బ్రహ్మానందరెడ్డి అభ్యర్తిత్వాన్ని నంద్యాల టీడీపీలో అందరూ అంగీకరిస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతోంది.సిట్టింగ్ ఎమ్ఎల్ఏ చనిపోతే ఆనవాయితీ ప్రకారం ఆకుటుంబానికే టికెట్టు ఇచ్చారు.ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలయితే దానికి బాధ్యుడుని కాదు అని ముందే ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది.అందుకే బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అఖిల భూజాపైన వేసుకోక తప్పలేదు.
ఆమె ఒక్కరే భారీ ఎత్తున ప్రచారానికి వెళ్లక తప్పదు. ఎందుకంటే, అభ్యర్థిని ప్రకటించడంతో తమ బాధ్యత పూర్తైపోయినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. నిజానికి, నంద్యాల గెలుపుపై టీడీపీ పెద్దలకే ఫిఫ్టీ ఫిఫ్టీ నమ్మకాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే, గతంలో టీడీపీ టిక్కెట్ తో భూమా అక్కడ గెలవలేదు కదా! వైకాపాలో ఉండగా గెలిచి.. తరువాత టీడీపీలోకి ఫిరాయించారు.
{loadmodule mod_custom,GA2}
నంద్యాలలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైతే దానికి పరిపూర్ణ బాధ్యురాలు అఖిల ప్రియే అనే చిత్రీకరణ ఉండొచ్చు! అఖిల ప్రియ మంత్రి పదవికే ఎసరు పడొచ్చు. భూమా వర్గానికి ఒక అవకాశం ఇచ్చామనీ, కానీ వారు నిరూపించుకోలేకపోయాంటూ పార్టీలో ప్రాధాన్యత తగ్గించే అవకాశమూ కచ్చితంగా ఉంటుంది. ఒక వేల టీడీపీ గెలిస్తే ఆక్రెడిట్ బాబకు … ఓడిపోతే ఇతరుల మీద నెట్టేయడం బాబుకు అలవాటె.మరి ఈఎన్నికను అఖిల ప్రియ ఎలాఎదుర్కొంటాదో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- ఓడిపోతే మంత్రి పదవి గోవిందేనా…..?
- నంద్యాల ఉప ఎన్నికలో కొత్త ట్విస్ట్
- వలసతో ఆందోళనలో ఉన్న చంద్రబాబు ఆయన వర్గం…
- చంద్రబాబుకు సవాల్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తి
{youtube}eNfv4VkqTcc{/youtube}