Tuesday, April 30, 2024
- Advertisement -

మునుగోడు రచ్చ : రాజగోపాల్ రెడ్డి.. 18,000 కోట్ల సంగతేంటి ?

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడే కొద్ది రాజకీయ వేడి మరింత రాజుకుంటుంది. టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల మద్య నెలకొన్న ఈ త్రిముఖ పోరులో విజయం కోసం ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ రచనలు గట్టిగానే జరుగుతున్నాయి. మూడు పార్టీలకు కూడా మునుగోడు విజయం అత్యంత కీలకం కావడంతో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీ కోవర్ట్ అంటూ టి‌ఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు టి‌ఆర్‌ఎస్, బీజేపీ రహస్య కుమ్మక్కు..అంటూ కాంగ్రెస్ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఈ విధంగా వాడి వేడి విమర్శలతో మునుగోడు సమరం పతాకస్థాయికి చేరుకుంటుంది. .

రాజగోపాల్ రెడ్డి 18,000 వేల కోట్లతో బీజేపీకి అమ్ముడుపోయాడని టి‌ఆర్‌ఎస్ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు. మునుగోడు అభివృద్ది కోసం అదే రూ.18,000 కోట్లు తీసుకొస్తే ఎన్నికల బరినుంచి టి‌ఆర్‌ఎస్ తప్పుకుంటుందని తీసుకొచ్చే సత్తా ఉంటే సవాల్ స్వీకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామని కేంద్రం నుంచి మునుగోడు అభివృద్దికి 18,000 కోట్ల నిధులు తీసుకొస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని కే‌టి‌ఆర్ కూడా స్పష్టం చేశారు. ఇక టి‌ఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా హీట్ ను మరింత పెంచుతున్నాయి.

రూ.18,000 కోట్లకు బీజేపీకి తాను అమ్ముడు పోలేదని యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్దం.. ఈ ఆరోపణను నిరూపించేందుకు కే‌సి‌ఆర్ మరియు కే‌టి‌ఆర్ సిద్దమా ? అని రాజగోపాల్ రెడ్డి తిరిగి సవాల్ విసిరారు. ఇలా టి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య వాడి వేడి వాతావరణం కొనసాగుతుంటే మరోవైపు రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా నుంచి 22 వేల కోట్ల గూగుల్ పే ట్రాన్సాక్షన్ జరిగినట్లు మరో వీడియో ను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. ఇక మునుగోడు పరిధిలో రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ పే అని పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి పై అటు కాంగ్రెస్ నేతలు, ఇటు టి‌ఆర్‌ఎస్ నేతలు గట్టిగానే విమర్చలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -