Tuesday, April 30, 2024
- Advertisement -

మునుగోడులో బీజేపీ ఓడిపోతే.. లాభమా ? నష్టమా ?

- Advertisement -

తెలంగాణలో గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక చేసిన రచ్చ ఏ స్థాయిలో ఉండిందో అందరికీ తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఈ బైపోల్ ను టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక ఎట్టకేలకు నవంబర్ 3తో మునుగోడు బైపోల్ వార్ ముగిసింది. గెలుపుపై మూడు పార్టీలు ధీమాగానే ఉన్నప్పటికి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాయి. అయితే మొదటి నుంచి కూడా మునుగోడులో పాగా వేసేది బీజేపీనే అంటూ కమలనాథులు ఘంటాపథం గా చెప్పుకొచ్చారు. .

ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో రైజింగ్ పార్టీగా మారుతుండడం, అంతేకాకుండా దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడంతో మునుగోడు ఉపఎన్నికలో కూడా తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు కమలనాథులు. దీనికి తోడు మునుగోడులో మంచి పట్టు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉండడంతో.. బీజేపీ గెలుగు ఖాయమనే భావనకు వచ్చారంతా. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆ పార్టీకి లాభమా నష్టమా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం మునుగోడులో బీజేపీ ఓడిపోయిన ఆ పార్టీకి నష్టం కన్నా లాభమే ఎక్కువట.

ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అన్నీ సర్వేలలో కూడా టి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానంలో బీజేపీ నిలిచింది కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితం అయింది. బీజేపీకి దాదాపుగా 36% ఓటు శాతం నమోదు అయిందని సర్వేలు తేల్చి చెప్పాయి. దాంతో తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే భావనను బలంగా చాటిచెప్పే ప్రయత్నం చేయవచ్చు. టి‌ఆర్‌ఎస్ మొదటి స్థానంలో బీజేపీ రెండవ స్థానంలో ఉండడం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మల్లె అవకాశం ఎక్కువ.

అంతే కాకుండా బీజేపీ రైజింగ్ పార్టీగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున బీజేపీకి గూటికి చేరే అవకాశం ఉంది. అలాగే అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలు కూడా బీజేపీ వైపు చేసే ఛాన్స్ ఉందనేది విశ్లేషకుల వాదన. అందువల్ల మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిన ఆపార్టీకి పెద్దగా నష్టం చేకూరే అవకాశం లేదని, రెండవ స్థానంలో రైజింగ్ పార్టీగా నిలవడం వల్ల ఇంకా ఆ పార్టీకి లాభమే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి మునుగోడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే నవంబర్ 5న వెలువడే ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -