తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక రాష్ర్టాన్ని ఏలితే సరిపోదు. తనకంటూ ఓ అడ్డా కావాలి. అండా దండా కావాలి. జాతీయ స్థాయిలో కొండంత బలం కావాలి. కేంద్రాన్ని గడగడలాడించే కీ పాయింట్ తానే కావాలని భావిస్తున్నారుట. అందుకోసం ఓ సరికొత్త వ్యహం రచించారని చెబుతున్నారు. ఇంతకుముందు థర్డ్ ఫ్రంట్ అంటూ దశాబ్ధ కాలం అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన చంద్రబాబు వేసిన ఎత్తుగడనే ఈసారి కేసీఆర్ కూడా వేస్తున్నారు.
తన అడ్డాలో చిన్నా చితకా పార్టీలతో పాటు నేషనల్ లెవల్ పార్టీలు కూడా మీటింగులు పెట్టుకునేలా కొత్త మంత్రాంగం నడిపిస్తున్నారుట. అందుకే లోకల్ పార్టీలన్నిటినీ కలుపుకుని పోతున్నారు. జాతీయ స్థాయి నేతల్ని తన గుప్పిట బంధించేందుకు ప్లాన్ వేస్తున్నారు.జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ప్రధాని పదవి ఆశిస్తున్న శరద్ పవార్‌తో కేసీఆర్ సీక్రెట్ మంతనాలు సాగించారని ఇదివరకే వార్తలొచ్చాయి. అంతేకాదు.. అతడికి వెన్నుదన్నుగా నిలిచి కొత్త మంత్రాంగం నడిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారుట.
అందుకే ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌హౌస్‌లోనే గడుపుతున్నారు. కేంద్రంలో సోనియా ఫ్యామిలీపై వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రభావం దేశంలో ఏమంత లేదు. కాబట్టి తనకంటూ ఓ మహానేతను క్రియేట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని కేసీఆర్ భావిస్తున్నారుట. ఆ మేరకు ఓ భారీ ప్రణాళికతో ముందుకు దూసుకెళుతున్నారని, ఫాం హౌస్‌లో మీటింగులు పెట్టి రహస్య మంతనాలు సాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు కేంద్రంలో మంత్రాంగం నడిపించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ని కేంద్రంలోకే పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. ఇదంతా చూస్తుంటే .. టీ-సీఎం ఓ రేంజు ప్లానింగు చేస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సిందే.
Related