Tuesday, June 18, 2024
- Advertisement -

కేసీఆర్ ను తప్పుబడుతూనే కేజ్రీవాల్ ను లాగడం

- Advertisement -

న్యాయాధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో.. తెలంగాణ రాష్ట్ర ఆందోళనలపై.. కేంద్రం దూకుడుగానే ముందుకు పోయేలా కనిపిస్తోంది. ఈ విషయంలో.. న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ తీరు చూస్తుంటే.. సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేలా ఉన్నట్టే అర్థమవుతోంది. ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు దిగేందుకు రెడీ అవుతున్నారంటూ.. మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన చేసిన కామెంట్లే.. ఇందుకు కారణమవుతున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లా.. కేసీఆర్ తమను బెదిరించాలని చూస్తున్నారని అర్థం వచ్చేలా.. సదానంద కామెంట్ చేశారు. ఢిల్లీ వచ్చి ఆందోళన చేస్తామంటే.. వద్దు అనేది లేదని.. స్వాగతిస్తామని కూడా వ్యంగ్యంగా చెప్పారు. విషయాన్ని ప్రధాని స్థాయి వరకూ వెళ్లకుండా.. తన స్టేట్ మెంట్లతో దాదాపు అడ్డుకున్నంత పని చేశారు. అయితే.. కొందరు ఇక్కడే ఓ విషయాన్ని పట్టుకుంటున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో.. కేంద్రాన్ని నడిపిస్తున్న బీజేపీకి రాజకీయంగా పెద్ద వైరమే ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి.. బీజేపీకి ఆమ్ ఆద్మీ అంటే పడడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఆడుకుంటూనే ఉంది. ఇప్పుడు.. అనుకోకుండా కేసీఆర్ రూపంలో వచ్చిన సందర్భాన్ని కూడా.. కేజ్రీవాల్ పై అక్కసు తీర్చుకునేందుకు కేంద్రం ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోంది.

కేసీఆర్ ను తప్పుబడుతూనే.. విషయంలోకి కేజ్రీవాల్ ను లాగడం.. బీజేపీ రాజకీయ వైఖరికి అద్దం పడుతోంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే.. ఇంట్రెస్టింగ్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -