Tuesday, May 6, 2025
- Advertisement -

అవినీతి ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న కేజ్రీ వెంట‌నే రాజీనామ చేయాలి కాంగ్రెస్ పార్టీ నేత అజ‌య్ మాకెన్‌

- Advertisement -
Kejriwal has no more right to be CM, should resign: Ajay Maken

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిన‌ట్లుంది. ఒక వెలుగు వెలిగిన కేజ్రీవాల్ ఈ మధ్య కాలంలో ప్రతిదీ ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్.. గోవాలలో కేజ్రీవాల్ కు షాక్ తగలటం తెలిసిందే.

దాని నుంచి కోలుకుంటున్నంతలో ఢిల్లీ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దారుణ పరాజయం పాలైంది. దీంతో.. కేజ్రీవాల్ సమర్థత మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చి పార్టీలోని నేత‌లు ఎదురుతిరుగుతున్నారు.
ఇది సరిపోదన్నట్లుగా పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా.. ఢిల్లీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కళ్ల ముందే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంచం తీసుకున్నట్లుగా ఆరోపించారు. అంతేనా.. కేజ్రీవాల్ తన బంధువుల కోసం రూ.50 కోట్ల భూదందాలను పరిష్కరించినట్లుగా కూడా తనతో మంత్రి జైన్ చెప్పారన్నారు.
అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కు మ‌రింత చిక్కులు ప‌డుత‌న్నాయి. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలు సీఎం క కేజ్రీవ‌ల్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్ల లంచాన్ని తీసుకున్నారని మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ కూడా విమర్శలు గుప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ పై ఆ పార్టీకి చెందిన నేతే స్వయంగా ఆరోపణలు చేయడాన్ని సీరియస్ గా పరిగణించి ఏసీబీ, సీీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. లంచం తీసుకుంటుండ‌గా నేను క‌ల్లారా చూశా మంత్రి క‌పిల్ మిశ్రా
  2. వ్య‌భిచారం కేసులో గుజ‌రాత్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
  3. నింగిలోకి దూసుకెల్లిన‌.. సార్క్ ఉప‌గ్ర‌హం
  4. వీసా నిబంధ‌న‌లు మ‌రింత ఖ‌టిన‌త‌రం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -